మారని జనం-నాయకులు.. ఏమి చేద్దాం.!

ఓటుకు నోటు తీసుకోవద్దు అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం మాకు నోటు ఇస్తేనే ఓటు వేస్తామని చెబుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  13 May 2024 8:46 AM IST
మారని జనం-నాయకులు.. ఏమి చేద్దాం.!

ఓటుకు నోటు తీసుకోవద్దు అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం మాకు నోటు ఇస్తేనే ఓటు వేస్తామని చెబుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో 1000 నుండి 5000 రూపాయల దాకా డబ్బులు పంచారనే వార్తలు కూడా వచ్చాయి. కొన్ని చోట్ల నాయకులు డబ్బులు ఇవ్వకున్నా.. ఓటర్లే ఆ నేత ఇళ్లకు, పార్టీ ఆఫీసులకు వెళ్లడం చూస్తుంటే జనంలో కూడా మార్పు రావాలని తప్పకుండా అనిపిస్తూ ఉంది.

ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు ఏపీలోని చాలా పార్టీలకు చెందిన నేతలు డబ్బులు విచ్చలవిడిగా పంచడం ఆందోళన కలిగిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో 'తమ ఇంట్లో ఓట్లు అమ్మబడవు' అంటూ కొందరు బోర్డులు ఇంటి ముందు వేళాడదీశారు. కొంత మంది డబ్బులు కూడా తీసుకోని కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ధారాళంగా, విచ్చలవిడిగా డబ్బు పంపిణీని అడ్డుకోవడం ఎలాగో, దానికి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడో ఎవరికీ తెలియడం లేదు.

Next Story