హైదరాబాద్: డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను బీజేపీ, బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నాయి..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ అని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ లీడర్ షిప్ ఉంటుంది అని రేవంత్ రెడ్డి అన్నారు. నూతన డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ చరిత్రను చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు. హిందువుల్లో అనేక రకాల దేవుళ్ళు,దేవతలు ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కులాన్ని,మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. దీన్ని బీజేపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి రాజకీయం చేస్తున్నాయి..అని ఎంపీ చామల విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. మెస్సి లాంటి అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడిని తీసుకువచ్చి హైదరాబాద్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిస్తున్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీజేపీ,బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించి తెలంగాణ ప్రజల మనసుల్లో నెగిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని బీజేపీ,బిఆర్ఎస్ చేస్తున్నాయి. ధర్నాలు,పంచాయతీలు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని బీజేపీ, బిఆర్ఎస్ ఆలోచన..అని ఎంపీ చామల ఆరోపించారు.