అప్పుడే మీకు ప్రజలు దూరం అయ్యారు : వీహెచ్
బీజేపీని విమర్శించే హక్కు BRS కి ఉండవచ్చు.. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు BRS కు లేదని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 1:30 PM ISTబీజేపీని విమర్శించే హక్కు BRS కి ఉండవచ్చు.. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు BRS కు లేదని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ అనేక అవకాశాలు ఇచ్చింది.. బీసీలను కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు చేసిందన్నారు. కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేయాలని చూశారు.. మేము కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ BRSకి దిక్కు అయ్యిందన్నారు. TRS పేరు BRS గా మారినప్పుడే ప్రజలు మీకు దూరం అయ్యారన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదు.. BRS స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ తగ్గించిందన్నారు. ఐఐటి, ఐఐఎం లలో రిజర్వేషన్ తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.. పదేళ్లలో ఏం చేశారో ఒక్కటి చెప్పండని ప్రశ్నించారు.
కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. లోకల్ బాడిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంగా చెబుతున్నారు. బలహీన వర్గాల కోసం ఆలోచన.. అభివృద్ధి చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు. ఐదు ఏళ్లలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామన్నారు.
మీకు తగాదాలు ఉంటే.. మీరు చూసుకోండి.. అభివృద్ధిని చూడలేక విమర్శలు చేస్తున్నారు. మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు.. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో తెల్వదన్నారు. కౌంటర్లు కాదు.. అభివృద్ధి మా కల్చర్ అన్నారు. తెలంగాణ తెచ్చింది మేము అన్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేది రాహుల్ గాంధీ డిమాండ్‌గా పేర్కొన్నారు.