బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు సొంత లాభం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని.. కవిత ఎపిసోడ్ తో ముగ్గురు కాంప్రమైజ్ అయ్యారని.. స్టేట్‌లో కేసీఆర్..సెంట్రల్‌లో మోడీని గెలిపించాలని ఒప్పందం అని సంచలన కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్‌కు ఎంఐఎం భీ టీమ్.. బీజేపీకి కూడా ఎంఐఎం భీ టీమేనని ఆరోపించారు. తెలంగాణలో పుట్టిన ఎంఐఎం ఇక్కడ 10 స్థానాల్లో పోటీ చేయరు. యూపీలో 100 స్థానాల్లో పోటీ చేశారని అన్నారు. బీజేపీకి లాభం చేయాలని ఆలా చేస్తున్నారని అన్నారు. అసదుద్దీన్, కేసీఆర్ చెప్పిన వారికే బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు.
గోషామహల్ రాజసింగ్ మీద ఎంఐఎం ఎందుకు అభ్యర్థిని పెట్టలేదని ప్రశ్నించారు. రాజసింగ్ దగ్గర కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయరని నిలదీశారు. మొత్తం పొలిటికల్ పొలరైజ్ చేస్తూ.. ప్రజలను చీటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. కవిత కేసుతో ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ని తీసేసి కిషన్ రెడ్డిని తెచ్చారన్నారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ముగ్గురు పెద్ద దొంగలు అని విమర్శించారు.
నాంపల్లి లో బొగస్ ఓట్లు ఉంటాయి.. రిగ్గింగ్ చేస్తారు.. కానీ బీఆర్ఎస్ బీజేపీ పక్కనే ఉంటది పట్టించుకోదన్నారు. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల స్కీమ్స్ ద్వారా అప్పుల తెలంగాణ అవుతుందని అంటారు.. వాటినే ఎక్కువ చేసి మేనిఫెస్టో లో చెప్పారని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.