కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం

Congress Ex MP Ponnam Prabhakar Fire On BRS. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

By Medi Samrat
Published on : 5 Jun 2023 5:00 PM IST

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ తెచ్చిన ధరణి వలన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు 10 వేల నష్ట పరిహారం ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. రైతులు బీఆర్ఎస్ నేతలను నిలదీస్తే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిప‌డ్డారు. తెలంగాణ ప్రజల బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలుపుతారని జోష్యం చెప్పారు.


Next Story