కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు..అక్కసు వెల్లగక్కారు: సీఎం రేవంత్
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik
కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు..అక్కసు వెల్లగక్కారు: సీఎం రేవంత్
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదే. కేసీఆర్, మోడీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు. నాకు, రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉంది. నేను ఎవర్ని నమ్మించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌లు ఏ రాష్ట్రంలో అమలులో లేవు. ఎన్నికలకు చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుంది...అని సీఎం అన్నారు.
కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్‌పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వం విధానం ప్రకటిస్తాం. కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కారు. పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నాడు. మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు? కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు. సంవత్సరం కాలం నుంచి పథకాలు తీసుకొచ్చాం.ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. నేను ఇంకా ఇరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా. నేను చట్టప్రకారమే నడుచుకుంటా. అరెస్టులు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి..అయినా అలా చేయలేను. నేను కమిట్‌మెంట్ ఇస్తే చేసి తీరుతా. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను. ఇప్పించాను. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డాం. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఆప్షన్ లేకనే కొంత మంది అధికారులను కొనసాగిస్తున్నాం..అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.