భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే వాయిదా పడింది. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో వరదలపై ఆయన ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయం తీసుకోగా..వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే వాయిదా పడింది.
కాగా రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సమీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో సమావేశం అయ్యారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తక్షణంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.