CM Revanth : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం.. క‌వితకు బెయిల్ వ‌స్తుంది.. కేసీఆర్ గవర్నర్ అవుతారు

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ బీజేపీలో విలీనం ప‌క్కా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు

By Medi Samrat  Published on  16 Aug 2024 9:51 AM GMT
CM Revanth : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం.. క‌వితకు బెయిల్ వ‌స్తుంది.. కేసీఆర్ గవర్నర్ అవుతారు

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ బీజేపీలో విలీనం ప‌క్కా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విలీనం త‌ర్వాత కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతార‌ని అన్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్నారు.. వాళ్ళ విలీనంతో కవితకు బెయిల్ వ‌స్తుంద‌న్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగకమానదన్నారు. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్రమంత్రి, హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందన్నారు.

రైతు రుణమాఫీకి 5 వేల కోట్ల రిజర్వ్ నిధులు ఉంచామ‌ని తెలిపారు. రుణమాఫీ కాని వారు కలెక్టరేట్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చన్నారు. ఒకే కుటుంబంలో వారికి 2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్ గా పరిగణించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామ‌న్నారు. నా మార్క్ ఉండాలనే ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీ ప్రకటించాన‌న్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి చేసింది ఏమి లేదన్నారు.

నా కుటుంబ సభ్యులకు ప్రభుత్వంలో ఎటువంటి పదవులు ఇవ్వలేదన్నారు. అమెరికాలో నా కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారు. ప్రభుత్వం లో ఎటువంటి బాధ్యతలు నా సోదరులకు ఇవ్వలేదన్నారు. నాకు ఏడుగురు సోదరులు.. నేను సీఎం అయ్యా అని ఇంట్లో కూర్చుంటారా అని ప్ర‌శ్నించారు. వారు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లినా.. రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Next Story