రైతు బంధు సమయానికి ఇవ్వాలని ఉన్నా.. ఆ విష‌యం గురించే ఆలోచిస్తున్నాం : సీఎం రేవంత్‌

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర సింగరేణిదని.. సకల జనుల సమ్మెలో దేశం అబ్బురపడే పోరాటం చేశార‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  26 Feb 2024 7:59 PM IST
రైతు బంధు సమయానికి ఇవ్వాలని ఉన్నా.. ఆ విష‌యం గురించే ఆలోచిస్తున్నాం : సీఎం రేవంత్‌

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర సింగరేణిదని.. సకల జనుల సమ్మెలో దేశం అబ్బురపడే పోరాటం చేశార‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సెక్రటరీయేట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. సింగ‌రేణి గత పదేళ్ల లో చాలా రకాలుగా వెనుకబడిందని.. కేంద్రం దీన్ని ప్రైవేట్ పరం చేయాలని భావిస్తే బీఆర్ఎస్ దానికి వంత పాడిందన్నారు.

తెలంగాణకు ప్రధాన ఆధారం అయిన నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్ తప్పుడు విధానాలను అవలంభించిందన్నారు. లక్షా ముప్పై వేల కోట్ల ఆదాయం ఉంటే డెబ్భై వేల కోట్లు బ్యాంకులకు చెల్లించే పరిస్థితి కేసీఆర్‌ తెచ్చారని వివ‌రించారు. అరవై ఏళ్లల్లో ఆరు వేల కోట్లు ఉంటే కేసీఆర్ హయాంలో అది 70వేల కోట్లు అయ్యింద‌న్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున ఇచ్చే జీతాలు 25వ తేదీ వరకు తీసుకెళ్లార‌ని తెలిపారు.

మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో జీతాలు నాలుగవ తేదీన ఇచ్చామని వెల్ల‌డించారు. రైతు బంధు సమయానికి ఇవ్వాలని ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం ఆలోచిస్తున్నామన్నారు. తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు తప్ప వాళ్ళ ఆరోపణలు ఎవరు సమర్దించడం లేదన్నారు. వాళ్ళ పార్టీ లీడర్లు ఎవరు వీరి మాటలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. నియామకాల విషయంలో మా ప్రభుత్వం పూర్తి బాధ్యతగా ఉందన్నారు. హరీష్ రావు సన్నాసిలాగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. స్టాప్ నర్సు, పోలీస్ శాఖ, సింగరేణి లో కారుణ్య నియామకాలపై మా సర్కార్ తగిన నిర్ణయం తీసుకుందన్నారు. దూలం లాగా పెరిగిన హరీష్ కు దూడ కు ఉన్న మెదడు లేదని ఎద్దేవా చేశారు.

Next Story