సీఎం రేవంత్ బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు: ఆర్.కృష్ణయ్య

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం బీసీలను మోసం చేయడమే అని ఆర్.కృష్ణయ్య విమర్శించారు.

By Knakam Karthik  Published on  11 Feb 2025 3:01 PM IST
Telangana, Caste Census, Cm Revanthreddy, R.Krishnaiah, Congress, Brs, Bjp

సీఎం రేవంత్ బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు: ఆర్.కృష్ణయ్య

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం బీసీలను మోసం చేయడమే అని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో 42 శాతానికి పెంచుతామని ప్రకటించి.. ఇప్పుడు తప్పించుకోవడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయడానికి ఏం అవరోధాలు ఉన్నాయని కృష్ణయ్య ప్రశ్నించారు.

బీసీలకు రిజర్వేషన్లు పెంచకపోవడం కాకుండా.. కులాల లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టిని డైవర్షన్ చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడానికి ఏం ఇబ్బంది అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఏర్పడితే పోరాటం చేస్తామని అన్నారు. కానీ ఏమీ చేయకుండా తప్పించుకోవడం సరైన పద్ధతి కాదని ఆర్.కృష్ణయ్య.. బీసీలపై కుట్ర చేయడం, దగా చేయడం అని అన్నారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో 42 శాతానికి పెంచుతామని చెప్పి బీసీలకు ఆశ లేపి.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన తప్పించుకుంటున్నారని విమర్శించారు. పైగా కులాల లెక్కలు గందరగోళం సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. కులాల లెక్కలు పక్కకు పెట్టి 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేక పోతే రాష్ట్రంలో మరో యుద్ధం జరుగుతుందని, మరో సంగ్రామం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదా అని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచడం లేదు, అసెంబ్లీలో చట్టం చేయడం లేదు, మంత్రివర్గంలో కూడా బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

Next Story