99 సార్లు అయినా ఢిల్లీ వెళతా..బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 2:53 PM IST
99 సార్లు అయినా ఢిల్లీ వెళతా..బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను కొట్టింది నేను, ఓడగొట్టింది నేను, కేసీఆర్‌ను దించి నేను కుర్చీ మీద నిలబడ్డాను. కేసీఆర్, కేటీఆర్‌కు బలుపు తప్ప ఏమీ లేదు. నేను పీసీసీగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాను. నేను సీఎంగా, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండు సున్నా వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పోయారు. అని సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో కేటాయించిన పథకాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ సభలో రింగ్ రోడ్డు ఇచ్చామని చెప్పారు. మెట్రో ఇచ్చామని కిషన్ రెడ్డి చెప్పారు. ఎక్కడ ఉన్నాయి మరి? రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ చేయకూడదని చేపట్టిన ధర్నాలో ఈటల రాజేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. మూసీ, మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి..అని సీఎం రేవంత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ప్రతిపక్ష పార్టీల నేతలు రాలేదు. కేంద్రమంత్రి మనోహర్ ఖట్టర్ లాల్ సికింద్రాబాద్ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం ఏర్పాటు చేస్తే కిషన్‌రెడ్డి ఎందుకు హాజరుకాలేదు? కేసీఆర్ ఫీల్ అవుతాడని ఆ సమావేశానికి వెళ్లలేదా అని..సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి కాబట్టే.. అప్పులు ఉన్నాయని చెప్పాం, బీఆర్ఎస్ వాళ్లు 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. వారికి రాష్ట్రంతో సంబంధం లేదేమో? అందుకే పోటీ చేయలేదు..2014 నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చకు మేం రెడీ, కేంద్రానికి తెలంగాణ నుంచి చెల్లించిన పన్నులు, రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో అనే దానిపై చర్చకు నేను, భట్టి వస్తాం.. కిషన్ రెడ్డి ఇంకా ఎవరు వస్తారో రమ్మని చెప్పండి. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను 99 సార్లు అయినా ఢిల్లీ వెళతా, పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులు మేం పద్నాలుగు నెలల్లో చేశాం.. అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.