24 గంటల కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ కట్టిన కరెంట్ ప్రాజెక్టులతోనే.. : సీఏల్పీ నేత భట్టి

CLP Leader Bhatti Vikramarka. బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క విమ‌ర్శించారు

By Medi Samrat  Published on  4 March 2023 3:30 PM IST
24 గంటల కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ కట్టిన కరెంట్ ప్రాజెక్టులతోనే.. : సీఏల్పీ నేత భట్టి

CLP Leader Bhatti Vikramarka


బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క విమ‌ర్శించారు. ప్రజల సొమ్మును కొద్ది మంది పెద్దలకే బీజేపీ పంచి పెట్టిన విషయాన్ని రాహుల్ జోడో యాత్రలో ప్రజలకు‌ చాటి చెప్పారని తెలిపారు. దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తున్నదని మండిప‌డ్డారు. అదానీకి ప్రధాని మోదీ పంచిన సొమ్ముపై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. మండల్, బ్లాక్ స్థాయిలో హాత్ సే హాత్ జోడోను చెయ్యాలని నిర్ణ‌యించాం. ప్రతిరోజు ఇంటింటికి‌ వెళ్తున్నామ‌ని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ ప్రమాదకరంగా మారిందన్న ఆయ‌న‌.. కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు తిన్నార‌ని ఆరోపించారు. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదని.. ప్రాజెక్టుకు కాల్వలు తవ్వకుండా నీళ్లు ఎట్ల ఇస్తార‌ని ప్రశ్నించారు. ఒక్క కాల్వ, డిస్ట్రిబ్యూటరీలు‌ లేవని దుయ్య‌బ‌ట్టారు. కృష్ణా నదిపై పాలమూరు తప్ప కొత్త ప్రాజెక్టేది? అన్నీ కాంగ్రెస్ కట్టినవేన‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్‌లో భూముల రేట్లు పెరిగాయి.. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తున్నదని ఆరోపించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నమని గొప్పలు.. కానీ కాంగ్రెస్ కట్టిన కరెంట్ ప్రాజెక్టులతోనే సాధ్యమైతున్నది. బీఆర్‌ఎస్ కట్టిన కొత్త ప్రాజెక్టు ఒక్కటి లేదని అన్నారు.


Next Story