టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లా చింతలపూడిలో 'రా కదలిరా' సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉతికి ఉతికి ఆరేయాలని అన్నారు. సభలో మాట్లాడిన చంద్రబాబు.. మా తమ్ముళ్లలో మందుబాబులు కూడా ఉన్నారని అన్నారు. పగలంతా పని చేసి సాయంత్రం పెగ్గు వేయడం వారికి అలవాటు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని సీఎం జగన్ ప్రైవేటు బ్రాండ్లు తీసుకువచ్చాడు. ఒకప్పుడు రూ.60గా ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200. అందులో రూ.150 జగన్ కు కమీషన్ వెళుతుందని తెలిపారు. మీ తాగుడు ద్వారా నెలకు రూ.4500 చొప్పున జలగ పీల్చేస్తున్నాడు. ఇది న్యాయమా? ఏం చేయాలి ఇతడ్ని. ఉతికి ఉతికి ఆరేయాలా వద్దా? అని ఆయన ప్రశ్నించారు. ఈ మద్యం తాగి 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30 వేల మంది చనిపోయారు. ఈ జలగ మాత్రం బాగుపడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు.
అర్జునుడంట! అర్జునుడు కాదు అక్రమార్జునుడని కూడా చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఎం జగన్ డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడంట. డబ్బులు కాదు... దెబ్బ మీద దెబ్బ! మీ ఖాతాల్లో డబ్బులే డబ్బులంట. ఇచ్చేది రూ.10 దోచుకునేది వందరూపాయలని విమర్శించారు చంద్రబాబు. తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచాడని, గతంలో రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 వస్తోందని ఆరోపించారు చంద్రబాబు.