వారిని బీసీల్లో కలిపితే, హిందూసమాజం తిరగబడటం ఖాయం: బండి సంజయ్

ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు.

By Knakam Karthik
Published on : 13 Feb 2025 12:21 PM IST

Telugu News, Bandi Sanjay, Bjp, Brs, Congress, Caste Census

వారిని బీసీల్లో కలిపితే, హిందూసమాజం తిరగబడటం ఖాయం: బండి సంజయ్

ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు.

స్థానిక ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే నిర్వహించడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. సర్పంచ్ లేకుంటే గ్రామ సభలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేది ఎలా అని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగటం కాదు.. రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలని అన్నారు. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోందని.. 73, 74 రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మత పరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, ఈ విషయం తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్త శుద్ధి కాంగ్రెస్‌కు లేదని తేట తెల్లమైందని అన్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చడం వల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని హెచ్చరించారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడం తథ్యమని బండి సంజయ్ చెప్పారు.

Next Story