కేంద్రం నిర్ణయం, రాహుల్‌గాంధీ విజయమే..కులగణనపై సీఎం రేవంత్ రియాక్షన్

కులగణన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

By Knakam Karthik
Published on : 1 May 2025 12:04 PM IST

Telangana, Cm Revanthreddy, Caste Census, Bjp, Congress, Pm Modi, RahulGandhi

కేంద్రం నిర్ణయం, రాహుల్‌గాంధీ విజయమే..కులగణనపై సీఎం రేవంత్ రియాక్షన్

కులగణన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జనగణనలో కుల గణనకు కేంద్రం సమ్మతి తెలిపిన నేపథ్యంలో సీఎం రేవంత్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయం. దేశంలోని అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయి. ఇందుకోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాయి. గత వందేళ్లుగా ఉన్న కులగణన డిమాండ్‌పై రాహుల్‌గాంధీ గొంతెత్తారు.

తెలంగాణలో కులగణన చేస్తామని మాట ఇచ్చి, ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను ఆదర్శంగా తీసుకుని. దేశ వ్యాప్తంగా జనగణనతో పాటుగా కులగణనను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు. ఈ అంశంపై కేంద్రమంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలి. ఈ అంశంపై తెలంగాణ మోడల్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం..అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story