తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని ఆయన ఈ మీటింగ్ సందర్భంగా చెప్పారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధం అయిందని, ఒకట్రెండు రోజుల్లో సమర్పిస్తామని సీఎం రేవంత్‌కు అధికారులు వివరించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని చెప్పారు.