నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే కాంగ్రెస్ విధానం: కేసీఆర్
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం కొనసాగుతుంది.
By - Knakam Karthik |
నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే కాంగ్రెస్ విధానం: కేసీఆర్
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్..తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని అసహనం వ్యక్తం చేశారు. తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే వారి విధానంగా అర్థమవుతుందని ఆక్షేపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న ఆయన, పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసేదని పేర్కొన్నారు.
మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటి అహంకార పూరిత హింస ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనము ఎట్లా ప్రతిపక్షాలతో వ్యవహరించాలో నేర్పుతున్నది. గుడ్లు తీయడం, లాగులో తొండలు ఇడ్చుడు వంటివి ఎట్లా చేయాలో చెబుతున్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఒక కొత్త పాలసీ తేలేదు. తీసుకువచ్చిన పాలసీ అంతా భూమి రియల్ ఎస్టేట్ కు సంబంధించిందే అయినా రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు డైరెక్టుగా వచ్చేది కానీ ఈరోజు ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం అంతా లైన్లలో నిలబడే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది పథకం ఒకటి ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసింది..అని కేసీఆర్ విమర్శించారు.