ఆయన అక్రమాలకు కేంద్రం సపోర్టు..కేటీఆర్ సంచలన ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on  23 Feb 2025 11:58 AM IST
Telangana, Ktr, Cm Revanth, Congress, Brs, Pm Modi

ఆయన అక్రమాలకు కేంద్రం సపోర్టు..కేటీఆర్ సంచలన ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు, పాలనా వైఫల్యాలకు కేంద్రంలోని బీజేపీ దన్నుగా నిలుస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ ఎందుకు రక్షణ కల్పిస్తోందన్నది ? మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు.

అమృత్ స్కామ్ లో అర్హత లేని రేవంత్ సోదరుడికి రూ.1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని..ఇందుకు రుజువులు ఉన్నాయని...అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుండి చర్యలు శూన్యమని కేటీఆర్ ఆరోపించారు. ఆర్ఆర్ పన్ను (చదరపు అడుగుకు 150 రూపాయలు) బిల్డర్ల నుండి వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీనే స్వయంగా చెప్పారని..అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి చర్య లేదని కేటీఆర్ గుర్తు చేశారు. రెవెన్యూ మంత్రిపై ఈడీ దాడులు- భారీగా డబ్బు రికవరీ అని మీడియా నివేదికలు వెలువడ్డాయని...అయినప్పటికీ 150 రోజుల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి చర్య లేదు ఎందుకని కేటీఆర్ నిలదీశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ ఎందుకు రక్షణ కల్పిస్తోందని ? మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందన్నారు. చివరకు ఎస్‌ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడంపైనా లేదా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవడంపైనా అయినా ఎన్డీఎస్ఏ లేదా మరేదైనా జాతీయ ఏజెన్సీ స్పందిస్తుందో లేదో వేచి చూద్దామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story