ఆ కేసు లొట్టపీసే, 14 కాదు 1400 పెట్టుకోండి..కేటీఆర్ హాట్ కామెంట్స్
ఫార్ములా ఈ-కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని..రేవంత్ కూడా లొట్టపీసు ముఖ్యమంత్రే..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik
ఆ కేసు లొట్టపీసే, 14 కాదు 1400 పెట్టుకోండి..కేటీఆర్ హాట్ కామెంట్స్
ఫార్ములా ఈ-కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని..రేవంత్ కూడా లొట్టపీసు ముఖ్యమంత్రే..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీ లో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తేలిపోద్ది అని చెప్పా. నువ్వు ముందుకు రా.. నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ సిద్దం కావాలని డిమాండ్ చేశాను. కానీ రాలేదు. ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు, అటు తిప్పి ఇటు తిప్పి అడిగారు..అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదు. చిట్టి నాయుడు పంపిన ప్రశ్నలే అడుగుతున్నారు. వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సాధించిన నేత కేసిఆర్, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసీఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నారు...అని కేటీఆర్ విమర్శించారు.
నాపై 14 కేసులు పెట్టారు. ఇంకా 14000 కేసులు పెట్టుకోండి. ఎవరూ భయపడరు. అందరూ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు. సంబరాలు చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి. కేసులు, విచారణ పాత చింతకాయ పచ్చడే. నీలాగా లుచ్చా పనులు చేసి, అడ్డంగా డబ్బు కట్టలతో దొరికిన వాడు లేడు. అడ్డదారిలో పదవులు కొనుక్కొని పీసీసీ ప్రెసిడెంట్ అయిన వాడు లేడు..అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదొక లొట్టపీసు కేసు.. రేవంత్ రెడ్డి ఓ లొట్ట పీసు ముఖ్యమంత్రి పరిపాలన చేతకాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు.దద్దమ్మ రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేసున్నది దద్దమ్మ కాంగ్రెస్ సర్కార్!- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/0gzrXKvSZF
— BRS Party (@BRSparty) June 16, 2025