రీ ట్వీట్ చేస్తే కేసులా? పోలీసులు రేవంత్‌కు సైన్యంలా పనిచేస్తున్నారు: కేటీఆర్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు

By Knakam Karthik
Published on : 17 April 2025 12:00 PM IST

Telangana, Congress Government, Cm Revanthreddy, HCU Land Issue, Ktr, Brs

రీ ట్వీట్ చేస్తే కేసులా? పోలీసులు రేవంత్‌కు సైన్యంలా పనిచేస్తున్నారు: కేటీఆర్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ కూలంకషంగా నివేదిక ఇచ్చింది. ఆ భూములు హెచ్‌సీయూవే అని చెప్పింది. ప్రస్తుతం ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టవద్దని చెప్పింది. న్యాయ వ్యవస్థపై గౌరవం పెరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. 100 ఎకరాలు పునరుద్ధరణ చేయాలి, లేకుంటే అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది విద్యార్థులు, ప్రకృతి ప్రేమికుల విజయం..అని కేటీఆర్ మాట్లాడారు.

మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి వార్షికోత్సవం అయింది. సెంటర్ ఎంపవర్ కమిటీ ఇచ్చిన నివేదికపై మోడీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? రేవంత్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవడంలేదు? సుప్రీంకోర్టు జడ్జి అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని అన్నారు. అక్కడ వీడియోలు చూశామన్నారు. వారిపై కేసులు పెడతారా? రీ ట్వీట్ చేస్తే కేసులు పెడతారా? రేవంత్ తప్పులకు అధికారులు బలవుతున్నారు. కొందరు పోలీసులు రేవంత్‌ ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్న అధికారులను వదలిపెట్టం..అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story