గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదు..సీఎంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి విధానాలే కారణమని కేటీఆర్ అన్నారు.

By Knakam Karthik
Published on : 17 March 2025 12:00 PM IST

Telangana, Cm Revanthreddy, Assembly Sessions, Ktr, Brs, Congress

గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదు..సీఎంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి విధానాలే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ..ప్రభుత్వం పూర్తి అట్టర్ ప్లాఫ్ అని సీఎం స్వయంగా ఒప్పుకున్నారు. రూ.70 వేల కోట్లు ఆదాయం తగ్గిందని సీఎం ఒప్పుకున్నారు. తెలంగాణ రైజింగ్ అంటూనే ఈ తగ్గింపు ఏమిటి? ఇది ముమ్మాటికి తెలంగాణ ఫాలింగ్. ఇంతకంటే రాష్ట్రానికి ఘోరబమైన అవమానం ఒంకొకటి ఉండదు. బడ్జెట్‌లో రూ.71 వేల కోట్ల రూపాయల తగ్గింపు దారుణం. తెలంగాణలో వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పగా చెబుతుంటే మరి ఆదాయం ఎలా తగ్గింది? బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పజెప్పితే, క్యాన్సర్ అంటూ మాట్లాడి రేవంత్ నాశనం చేశాడు. ఏఏ రంగాల్లో వృద్ధి పెరిగిందో బడ్జెట్‌లో చెప్పాలి. దానితో వచ్చే ఆదాయం పెరిగిన తీరు చెప్పాలి..అని కేటీఆర్ డిమాండ్ చేశారు. బడ్జెట్ కంటే ముందే నేరాన్ని అంగీకరించి సీఎం రేవంత్ అప్రూవర్‌గా మారారు. రేవంత్ ఏడాది కాలంగా చేసిందంతా నెగటివ్ పాలిటిక్స్, అక్రమ నిర్బంధాలు, తెలంగాణను క్యాన్సర్ అంటూ రాష్ట్ర పరువు తగ్గించడం వంటి అడ్డమైన మాటల కారణంగానే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది..అని కేటీఆర్ విమర్శించారు.

పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది..

రేవంత్ వంటి పిచ్చోడి చేతిలో తెలంగాణ రాష్ట్రం రాయి అయిపోందని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలోనే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అనడానికే ఇదే నిదర్శనం. ఎలాంటి ఆర్థికమాంద్య, కోవిడ్ వంటి సంక్షోభం లేకుండానే ఆర్థిక పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. కేంద్రంతో మంచిగా ఉన్నానని చెబుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అదనంగా తెచ్చింది ఏమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.

40 సార్లు కాదు 400 సార్లు వెళ్లిరా.. కానీ..

ఢిల్లీకి 40 సార్లు కాకపోతే 400 సార్లు పోయి ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకో, మాకేం సమస్య లేదు..కానీ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పు? కేంద్రంతో సఖ్యతతో ఉండి సాధిస్తామని అన్నారు..ఏం సాధించారు. తెలంగాణ ప్రజలు విచక్షణతో ఆలోచించి రెండుసార్లు మాకు అవకాశం ఇచ్చారు.. కాబట్టి తెలంగాణ బలంగా నిలబడింది. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రితో సమైక్యాంధ్ర పాలకులు అన్న మాటలు నిజమవుతున్నాయి..అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవంత్ రెడ్డికి గాసిప్స్ మీద తప్ప గవర్నెర్స్ మీద దృష్టి లేదు. రేవంత్ ముఠా టీడీఆర్ స్కామ్ చేయబోతుంది..అని కేటీఆర్ ఆరోపించారు.

Next Story