నాడు ప్రగతిబాట, నేడు అధోగతి బాట..పంచాయతీల్లో పాలన పడకేసింది: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 24 March 2025 12:26 PM IST

Telangana, Ktr, Congress Government, Brs, Cm Revanthreddy

నాడు ప్రగతిబాట, నేడు అధోగతి బాట..పంచాయతీల్లో పాలన పడకేసింది: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్‌లో ఆయన ఇలా రాసుకొచ్చారు..'అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్న‌ట్టుగా ప్ర‌భుత్వ తీరు ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌దేళ్ల కేసీఆర్ పాల‌న‌లో పల్లెలు నాడు ప్రగతి బాట ప‌డితే... నేడు 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట ప‌ట్టాయని విమ‌ర్శించారు. 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయ‌ని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 12,754 గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసింద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌జ‌లు తాగునీటికి గోస ప‌డుతున్నార‌ని, వీధి దీపాలు వెలగని ప‌రిస్థితి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో దేశానికే ఆదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్న తెలంగాణ పల్లెలు... నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యంతో నిధులు లేక వెలవెలబోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌జలు ఆలోచించాల‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story