మా అయ్య తెలంగాణ తెచ్చినోడు..పేరు చెప్పుకుంటే తప్పేంటి రేవంత్?: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 26 Dec 2025 1:33 PM IST

Cm Revanthreddy, Ktr, Brs, Kcr, Congress Government

మా అయ్య తెలంగాణ తెచ్చినోడు..పేరు చెప్పుకుంటే తప్పేంటి రేవంత్?: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..ఏనుములు రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి..మూడు లక్షలు కోట్ల బడ్జెట్ తో కోటి మంది మహిళలును ఎలా కోటేశ్వరలును ఎలా చేస్తావు రేవంత్ రెడ్డి, నీ కిస్మాత్ బాగుంది సీఎం అయినావు, ఢిల్లీకి సంచులు పంపుకుంటా..అంటూ విమర్శించారు.

టివి పెడితే చాలు రేవంత్ రెడ్డి తిట్లు పురాణం. ఏమి భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి మాకు రాదా, హైదరాబాద్ లోకి భాష రాదు అనుకుంటున్నావా హిందీ, ఇంగ్లీష్ తెలుగు అన్ని భాషలు తిడతా. కేసీఆర్ బయటకు రా అన్నారు వచ్చిండు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టగానే సీఎం రేవంత్ రెడ్డి చమటలు పడుతున్నాయి. ఇక అసెంబ్లీకి వస్తే తట్టుకోగల్గుతావు. గుంటూరులో చదువుకుంటే నీకేమి సమస్య రేవంత్ రెడ్డి. నేను ఆంధ్రాలో చదువుకుంటే నువ్వు ఆంధ్ర అల్లుడ్ని తెచ్చుకున్నావుగా. నీ లెక్కా చదువు సంధ్య లేకుండా తిరగలేదు. ఇతర దేశంలో చదువుకి వెళ్ళినప్పుడు అక్కడ మన పని మనము చేసుకోవాలి, అక్కడ నా బాత్రూం నేను కడుకున్న నీకేమి బాధ..అని కేటీఆర్ పేర్కొన్నారు.

మా తండ్రి గొప్పోడు, మొనగాడు తెలంగాణ తెచ్చిండు నా అయ్య పేరు నేను చెప్పుకుంటా తప్పేముంది. నువ్వు అన్ని మంచి పనులు చేయి నీ మనవుడు నీ పేరు చెప్పుకుంటాడు. కొడంగల్ లో కూడా రేవంత్ రెడ్డి ని గెలవనీయం. పాలమూరు రంగారెడ్డి గురించి అడిగితె కేసీఆర్ ని తిడతావా? గీతమ్మకు చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇలా అరిచి అరిచి ఏదో ఒకరోజు ఎవరు ఒకరిని కరుస్తాడు కట్టేసి ఉంచమ్మ. రేవంత్ నీ భాష చూసి పిల్లలు టివి చూడటం బంద్ చేస్తున్నారు. తిరిగి తెలంగాణ రాష్ట్రాన్నికి కేసీఆర్ సీఎం అవుతారు..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story