బిందె సేద్యమా? ట్రాన్స్‌ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు
By Knakam Karthik
బిందె సేద్యమా? ట్రాన్స్‌ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో “బిందె” సేద్యమా ?? ఎంతటి దుస్థితి తెచ్చినవ్ రేవంత్...!!..అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని అడుగు బయటపెట్టొద్దని కేసీఆర్ సంకల్పిస్తే..చివరికి మహిళలు బిందెలతో నీరు తెచ్చుకుని.. వరి నారు కాపాడుకునే పరిస్థితి కల్పిస్తావా ? ఇప్పటికే తాగునీటి కోసం తండ్లాడుతున్న అక్కాచెల్లెళ్లకు ఈ కొత్త కష్టాలేంటి ??..అంటూ కేటీఆర్ ఎక్స్‌లో ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని రంగధామునిపల్లిలో ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయి 15 రోజులైనా మరమ్మత్తు చేయించే తీరిక లేదా? ఏడాదిన్నరగా మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు మరమ్మత్తు చేయడం మీకు చేతకావడం లేదు. చివరికి ట్రాన్స్ ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా ?. సాగునీటి వసతి కల్పించకుండా ఇప్పటికే చేతులెత్తేశావు.. కనీసం కరెంట్ మోటర్లతో పంట కాపాడుకుందామంటే కూడా ఇన్ని కష్టాలా ? బీఆర్ఎస్ హయాంలో పెరిగిన భూగర్భజలాలను వాడుకునే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గం కాక మరేంటి ?. కళ్లముందే వరినారు ఎండిపోతుంటే తట్టుకోలేక..బిందెలతో ఆడబిడ్డలు పడుతున్న అగచాట్లు ఈ ముఖ్యమంత్రికి కనిపించడం లేదా ?. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు.. తాగునీటితోపాటు సాగునీటికి కూడా బిందెలు మోస్తున్న ఈ ఆడబిడ్డల బాధలు తీర్చే సోయి ఈ సీఎంకు ఎప్పుడొస్తుందో..అని కేటీఆర్ రాసుకొచ్చారు.
ఇందిరమ్మ రాజ్యంలో “బిందె” సేద్యమా ?? ఎంతటి దుస్థితి తెచ్చినవ్ రేవంత్...!! మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని అడుగు బయటపెట్టొద్దని కేసీఆర్ గారు సంకల్పిస్తే.. చివరికి మహిళలు బిందెలతో నీరు తెచ్చుకుని.. వరి నారు కాపాడుకునే పరిస్థితి కల్పిస్తావా ??ఇప్పటికే తాగునీటి కోసం… pic.twitter.com/CgjrKXuYDI
— KTR (@KTRBRS) July 14, 2025