ఆర్టీసీ ఛార్జీల పెంపును ఏడో గ్యారంటీ అని ప్రచారం చేయండి..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎక్స్ వేదికగా స్పందించారు
By Knakam Karthik
ఆర్టీసీ ఛార్జీల పెంపును ఏడో గ్యారంటీ అని ప్రచారం చేయండి..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణలో స్పెషల్ బస్సుల పేరుతో టీజీఎస్‌ఆర్టీసీ అధిక వసూళ్లు చేసిందని సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎక్స్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన పోస్టులను తన ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
ఈ మేరకు కేటీఆర్ ఇలా రాస్తుకొచ్చారు.. 'సోనియా గాంధీ అవార్డు గ్రహీత రేవంత్ రెడ్డికి ఒక విన్నపం. ఏదైనా పండుగ రోజు మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల 'రేర్' దీవెనలను నేరుగా పొందాలని కోరుతున్నాను. పండుగొస్తే చాలు బెంబేలెత్తేలా చేస్తున్న రేవంతానికి సన్మానం చేయడానికి ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. మహిళలకు ఉచితం అంటూనే పురుషులకు ఛార్జీలు డబుల్ చేసి వాళ్లని ట్రబుల్ చేస్తున్న రేవంతాన్ని చూడటానికి జనాలు తహతహలాడుతున్నారు. పండగ రోజు కూడా ప్రజల సొమ్ములు కొల్లగొట్టాలంటే ప్రత్యేకమైన టాలెంట్ కావాలి! రాఖీ రోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం అంటే మామూలు తెలివి కాదు!. పోని ఒక పని చెయ్యండి - ఈ పెంచుడు కార్యక్రమాన్ని “ఏడో గారంటీ” అని ప్రచారం చెయ్యండి, వీలయితే “పండగ గిఫ్ట్” అని కార్డులు వేసి పంచిపెట్టండి! జనం బాగా గుర్తుపెట్టుకుంటారు..అని సెటైరికల్ ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ అవార్డు గ్రహీత రేవంతానికి ఒక విన్నపం...ఏదైనా పండుగ రోజు మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల 'రేర్' దీవెనలను నేరుగా పొందాలని కోరుతున్నాను.పండుగొస్తే చాలు బెంబేలెత్తేలా చేస్తున్న రేవంతానికి సన్మానం చేయడానికి ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. మహిళలకు ఉచితం అంటూనే… pic.twitter.com/XvXLvZb4Gq
— KTR (@KTRBRS) August 12, 2025