దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్‌పై చర్చకు రండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్‌ మీదనే చర్చ పెడదాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు

By Knakam Karthik
Published on : 16 July 2025 5:30 PM IST

Telangana, Cm Revanthreddy, Ktr, Brs, Congress Government, Medigadda Barriage

దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్‌పై చర్చ పెడదాం..సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్‌ మీదనే చర్చ పెడదాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేము విసిరిన సవాల్ ను స్వీకరించాలి. చర్చకు రా అని సవాలు విసిరి చర్చకు వెళితే రాకుండా రేవంత్ రెడ్డి పారిపోయిండు. చర్చకు వస్తవా అని పిలిచి పారిపోయిన పిరికి సన్నాసి రేవంత్ రెడ్డి. మరొకసారి నాగార్జునసాగర్ కట్టపైన చర్చకు వస్తావా అని సవాల్ విసురుతుండు. రేవంత్ రెడ్డికి తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నాడు. నాగార్జునసాగర్ కట్టమీద కాదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చకు రావాలని సవాలు విసురుతున్నాం. ఇప్పటికే మా సీనియర్ నాయకులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లి వచ్చి మరీ నీకు సవాల్ విసిరిండు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బరాజ్ మీద చర్చకు మేము విసిరిన సవాల్ స్వీకరించాలి..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గం చివరి మడి వరకు నిలిచిన నాయకుడు కేసీఆర్ అని రేవంత్ కు తెలుసు. అయినా కూడా రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాతున్నాడు. రేవంత్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. తనను దొంగ లెక్క చూస్తున్నారని పదేపదే మాట్లాడుతున్నారు. ఇచ్చిన అమలు చేయమంటే ఏం చేస్తారో చేసుకోండి, నన్ను కోసుకు తింటారా అంటూ రంకెలు వేస్తున్నాడు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని ప్రజలను అంటున్నాడు. రానున్న స్థానిక సంస్థల్లో ప్రజలు ఏం పీక్కుంటారో ప్రజలే చూపిస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి దొంగలు, లంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదు. అందుకే ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉండే విధంగా రాజ్యాంగం రాశారు. లేకుంటే దేశంలో రేవంత్ లాంటి మోసాగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను దేశంలో కూడా ప్రవేశపెట్టేవారు. రాజకీయాల్లో తిట్లు వాడడం మాకు ఇష్టం లేదు. కానీ రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందని మాట్లాడాల్సి వస్తుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు మేము కూడా తిట్లు వాడక తప్పడం లేదు..అని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story