అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలను ఎకో పార్క్‌ చేస్తాం: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలనకు పాతర వేసి, బుల్డోజర్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 3 April 2025 11:27 AM IST

Telangana, Ktr, Congress Government, HCU Land Issue, Brs, Cm Revanthreddy

అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలను ఎకో పార్క్‌ చేస్తాం: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలనకు పాతర వేసి, బుల్డోజర్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పార్టీ తరపున సెల్యూట్. విద్యార్థులతో ఈ అంశంపై ప్రభుత్వం చర్చించాలి. విద్యార్థులను గుంట నక్కలు అని సీఎం రేవంత్, ఒక మంత్రి పేమెంట్ బ్యాచ్ అంటారు. మరో మంత్రి అక్కడ జంతువులు, పక్షులు లేవని అంతా ఏఐ టెక్నాలజీ అంటారా? అని..ప్రశ్నించారు.

ప్రభుత్వ భూమికి మీరు కాపలదారు మాత్రమే. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లా బుల్డోజర్‌లతో కూల్చివేతలు ఎందుకు? వీకెండ్స్ కూల్చివేతలపై హైడ్రాపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నా మీరు ఎలా కూల్చివేస్తారు. హెచ్‌సీయూ భూములపై కేసీఆర్ ముఖ్య నేతలతో చర్చించారు. హరిత విప్లవం సృష్టించింది కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో 7.7 శాతం ఫారెస్ట్ ఏరియా పెరిగింది. కేంద్రం 2021లో ఇదే విషయం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. మూడేళ్లలో మేం అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు చేస్తాం. ఇది హైదరాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ హామీ..అని కేటీఆర్ మాట్లాడారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే మేము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. రోహిత్ వేముల విషయంలో రాహుల్‌గాంధీ వస్తే మా హయంలో ఎస్కార్ట్ ఇచ్చాం. ఇప్పుడు హెచ్‌సీయూలో ఇంత జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు రారు? ఎందుకు మాట్లాడరు?..అని కేటీఆర్ ప్రశ్నించారు.

Next Story