Telangana : కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయిన స్థానాలివే..

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) హైదరాబాద్‌తో పాటు మరో ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది.

By Medi Samrat  Published on  6 Jun 2024 12:56 PM IST
Telangana : కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయిన స్థానాలివే..

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) హైదరాబాద్‌తో పాటు మరో ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణలోని 17 పార్లమెంటరీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ 14 నియోజకవర్గాల్లో మూడో స్థానం, రెండు స్థానాల్లో రెండో స్థానం, హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.

2014 నుంచి 2024 వరకు పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ చేవెళ్ల, సికింద్రాబాద్‌ తదితర నియోజకవర్గాల్లో తమ డిపాజిట్లు నిలుపుకోవడానికి అవసరమైన ఓట్లను సాధించడంలో విఫలమైంది.

BRS డిపాజిట్లు కోల్పోయిన లోక్‌సభ నియోజకవర్గాలు..

ఆదిలాబాద్

నిజామాబాద్

జహీరాబాద్

మల్కాజిగిరి

సికింద్రాబాద్

హైదరాబాద్

చేవెళ్ల

మహబూబ్ నగర్

మరోవైపు బీజేపీ రెండు నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోగా.. వారి అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు.

బీజేపీ డిపాజిట్లు కోల్పోయిన నియోజకవర్గాలు..

మహబూబాబాద్

ఖమ్మం

కాంగ్రెస్ కూడా ఓ స్థానంలో..

హైదరాబాద్ లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా కోల్పోయింది. అయితే మిగతా నియోజకవర్గాల్లో మాత్రం డిపాజిట్లు దక్కించుకోగలిగింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన మాధవి లత రెండో స్థానంలో నిలిచి డిపాజిట్‌ను నిలబెట్టుకున్నారు.

ఎన్నికల్లో డిపాజిట్ అంటే ఏమిటి?

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రూ. 25,000 డిపాజిట్ చేయాలి. ఈ మొత్తాన్ని భారత ఎన్నికల సంఘం వద్ద డిపాజిట్ చేస్తారు. దానిని సెక్యూరిటీ డిపాజిట్ అంటారు.

అభ్యర్థి నియోజకవర్గంలో పోలైన మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో ఆరవ వంతును పొందడంలో విఫలమైతే వారి సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు.

Next Story