ఆ తీర్పుపై కేటీఆర్ ఫుల్ హ్యాపీ

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామా రావు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపే విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  17 July 2024 9:15 PM IST
ఆ తీర్పుపై కేటీఆర్ ఫుల్ హ్యాపీ

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామా రావు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపే విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాల్లో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ని మార్చాలన్న ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతీకార, కక్ష సాధింపులకు ఓ పరిమితి ఉంటుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై దుష్ర్పచారాలు చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలోనూ సరైన గుణపాఠం ఖాయమని కేటీఆర్ అన్నారు.

'సత్యమేవ జయతే! రాజకీయ ప్రతీకారాలకు ఓ పరిమితులు ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎక్కువ కాలం భరించలేమని సుప్రీంకోర్టు తీర్పు పునరుద్ఘాటిస్తుంది’ అని రామారావు బుధవారం సుప్రీం కోర్టు ఆదేశంపై స్పందించారు. కేసీఆర్‌ గారి కేసులో అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలో ప్రజాకోర్టు కూడా ఇదే తరహా తీర్పు వెలువరించనుంది. కాంగ్రెస్‌ దురుద్దేశపూరిత ప్రచారంపై సత్యం విజయం సాధిస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story