తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా ఈ కార్ రేస్ వ్యవహారం నడుస్తోంది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే కారు పార్టీ మాత్రం.. సైలెంట్‌గా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై స్పీకర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, గూడెం మహిపాల్‌రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, అరికపూడి గాంధీ, తెల్లాం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌లపై రిట్ పిటిషన్ వేసింది. కాగా ఈ కేసుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా, టైం ఫిక్స్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్.