బీజేపీలో చేరిన బోగ శ్రావణి

Boga Shravani joined BJP. జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణి బీజేపీలో చేరారు.

By Medi Samrat  Published on  1 March 2023 4:44 PM IST
బీజేపీలో చేరిన బోగ శ్రావణి

Boga Shravani


జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణి బీజేపీలో చేరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరవ్వలేదు. బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో తనను అణచివేశారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా బీఆర్ఎస్ అధిష్టానం తనను ఓదార్చలేదన్నారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.





Next Story