బీజేపీలో చేర‌నున్న బోగ శ్రావణి

Boga Shravani to join BJP. జగిత్యాల మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి బీజేపీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది

By Medi Samrat  Published on  1 March 2023 12:34 PM IST
బీజేపీలో చేర‌నున్న బోగ శ్రావణి

జగిత్యాల మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి బీజేపీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. బుధ‌వారం ఢిల్లీలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స‌మ‌క్షంలో శ్రావణితో పాటు పలువురు జగిత్యాల నాయకులు కాషాయ‌ కండువా కప్పుకొనున్నారు. రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, పార్టీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. శ్రావణి చేరిక పట్ల బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కానుందని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.




Next Story