కేసీఆర్ మిస్సింగ్ అంటున్న బీజేపీ..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా ఇటీవలి కాలంలో పెద్దగా కనిపించడం లేదు.

By Medi Samrat  Published on  8 Jan 2025 6:15 PM IST
కేసీఆర్ మిస్సింగ్ అంటున్న బీజేపీ..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా ఇటీవలి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు, ప్రెస్ మీట్లకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు కేసీఆర్. ఆయన ఎక్కువగా కనిపించకపోవడంపై ఇతర పార్టీల నాయకులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ బీజేపీ అధికారిక X హ్యాండిల్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కె. చంద్రశేఖర్ రావు ఉన్న "మిస్సింగ్" నోటీసును పోస్ట్ చేశారు. పోస్ట్ లో

"పత్తా లేని పెద్దమనిషి,

అధికార భోగానికే గానీ,

ప్రజల బాదరబందీలపై పట్టింపులేని దొర !

#PrashnistunnaTelangana" అని ఉంది.

ఇక పోస్టర్‌లో "10 ఏళ్ళ పాటు అధికారం అనుభవించి, తెలంగాణను దోచుకున్న ఈయన, ఓడించి ప్రతిపక్షంలో కుర్చోపెడితే, కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరఫున ప్రశ్నించకుండా పత్తా లేకుండా పోయిండు" అని ఉంచారు.


Next Story