కాళేశ్వరం డిజైన్లతో నాకేం సంబంధం?: ఈటల
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు
By Knakam Karthik
కాళేశ్వరం డిజైన్లతో నాకేం సంబంధం?: ఈటల
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు...ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ నోటీసులు అనేది పేపర్‌లో వచ్చిందే తప్ప, ఇప్పటివరకు నాకు ఎలాంటి కాగిత అందలేదు. ఒక వేళ కమిషన్ నాకు నోటీసులు ఇస్తే.. మా పార్టీతో చర్చించి తప్పకుండా రెస్పాండ్ అవుతా. అయినా నాకు ఎందుకు ఇచ్చిందో ఏం సంబంధమో అని ప్రజలు నవ్వుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అన్ని డిపార్టుమెంట్లకు నిధులు కేటాయిస్తాను..అలానే కాళేశ్వరానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అంతేకానీ దాని డిజైన్లు ఎలా ఉన్నాయి? దాని కెపాసిటీ ఎంత? నాకు ఏం సంబంధం ఉంటుంది? అయినా చట్టం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా కమిషన్ ముందు హాజరవుతా..అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. కాళేశ్వరంపై జూన్ ఐదో తేదీన విచారణకు రావాలని కేసీఆర్కు, జూన్ ఆరో తేదీన హరీష్ రావు, జూన్ తొమ్మిదో తేదీన ఈటల రాజేందరను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో భేటీ అయ్యారు. అయితే, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.