తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చాలని చూస్తోంది అని.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో చేతకాని పాలన నడుస్తోంది. కొన్ని రోజులు హైడ్రా, హెచ్‌సీయూ, సినిమా వాళ్లు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీలు అమలు కావడం లేదు. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ పాలసీ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా పడిపోయింది. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్‌ను మార్చాలి అనుకుంటుంది. కానీ అర్హత ఉన్న వాళ్లు ఎవరూ లేరు. శ్రీధర్ బాబు ఒక్కరు ఉన్నారు కానీ కరప్షన్, కలెక్టివ్, పే కోర్స్ చేయని వారికి కాంగ్రెస్ సీఎం సీటును ఇవ్వదు..అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ డబ్బులు ఇచ్చి అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని కాంగ్రెస్ వాళ్లే గతంలో అన్నారు. కేసీఆర్ దగ్గర ఉన్న అధికారులే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైలుకు అయినా పంపించారు. ఈయనకు అది కూడా లేదు. ప్రభుత్వం ఇలా ఉంటే ప్రతిపక్ష ఫాం హౌస్ ఉంది. కేసీఆర్‌ను ప్రజలు మరచిపోతారు. 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలను ఒక్కటి కూడా కాంగ్రెస్ బయటపెట్టలేదు. హెచ్‌సీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఎవరు అనేది చెప్పాలి..అని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.