ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ మ‌హిళా నేత‌ సీరియ‌స్ రియాక్ష‌న్‌

మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షూ(పాద ర‌క్ష‌లు) చూపించారు

By Medi Samrat  Published on  11 Sept 2024 5:49 PM IST
ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ మ‌హిళా నేత‌ సీరియ‌స్ రియాక్ష‌న్‌

మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షూ(పాద ర‌క్ష‌లు) చూపించారు. గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉంది. మహిళలను అడ్డు పెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు పంపాలి అనుకుంటే మొదట కేసిఆర్‌కు పంపాలని అన్నారు.

ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టింది. కేసీఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో అన్నారు. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టునికి మాట్లాడు అంటూ హెచ్చ‌రించారు. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలన్నారు.. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలు సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ విచారణకు పిలవాలని కోరారు. కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. ప్రభుత్వాన్ని పడగోడతాం అంటే నిలబెడుతాం అని ఎమ్మేల్యేలు కాంగ్రెస్ లో చేరారన్నారు.

ఇదిలావుంటే.. పాడి కౌశిక్ రెడ్డి మ‌రో ఎమ్మెల్యే కేపీ వివేకానందతో క‌లిసి ఈ ఉదయం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పును వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీరె, గాజులు చూపిస్తూ.. అవి ధ‌రించి నియోజకవర్గాల్లో పర్యటించాల‌ని అన్నారు. పార్టీ మారిన మీకు ఇజ్జత్ లేదంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.


Next Story