Video: తల నరుక్కుంటా కానీ ఆ టోపీ పెట్టుకోను..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బోరబండ ఎన్నికల సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By - Knakam Karthik |
Video: తల నరుక్కుంటా కానీ ఆ టోపీ పెట్టుకోను..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: బోరబండ ఎన్నికల సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం టోపీ ధరించడంపై బండి సంజయ్ మాట్లాడుతూ..టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా. నేను హిందువును... టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇది. రేవంత్ కు దమ్ముంటే....గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలి. కేటీఆర్ కు వావి వరసల్లేవు.... చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేనే లేదు. సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకం. కవిత... మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు. ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్...వాళ్లతో జాగ్రత్త. పొరపాటున కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారు జాగ్రత్త..అని హాట్ కామెంట్స్ చేశారు.
కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు? రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? లక్ష ఓట్ల కోసం ఒవైసీ సంకుతున్న కాంగ్రెస్. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చిండు. అజారుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా? ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా? జూబ్లిహిల్స్ హిందువులారా... 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించండి ‘‘ఓట్ల కాంగ్రెసోళ్లు తురకోళ్ల లెక్క టోపీ పెట్టుకుని, నమాజ్ చేస్తూ డ్రామాలాడుతున్నరు. మళ్లా చెబుతున్నా.. నేను అట్లాంటి పని చేయను. ఎందుకంటే నేను హిందువును. ఇతర మతాలను గౌరవిస్తా తప్ప కించపర్చను, ఒకవేళ టోపీ పెట్టుకునే పరిస్థితే వస్తే నా తల నరుక్కుంటా. టోపీ మాత్రం పెట్టను’...అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
If a day comes when I must wear a skull cap for votes, I’d rather cut off my head.I’m an unapologetic Hindu - I won’t insult other faiths by faking a namaz.Even Muslim leaders like Azharuddin and MIM didn’t wear it. But CM Revanth Reddy and the Congress candidate did - just… pic.twitter.com/Qb9AS6lBwS
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 6, 2025