మళ్లీ అశోక్ నగర్ వెళ్లే అవకాశం నాకివ్వకండి.. బండి సంజయ్ హాట్ కామంట్స్

తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జ‌రుగుతోంద‌ని.. అందుకు జీవో నెంబర్ 29 ఓ సంకేతం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు

By Medi Samrat  Published on  19 Oct 2024 6:51 PM IST
మళ్లీ అశోక్ నగర్ వెళ్లే అవకాశం నాకివ్వకండి.. బండి సంజయ్ హాట్ కామంట్స్

తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జ‌రుగుతోంద‌ని.. అందుకు జీవో నెంబర్ 29 ఓ సంకేతం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ‌న మాట్లాడుతూ.. సోనియా జన్మదినం.. నిరుద్యోగుల బలిదినం కాబోతోందని.. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలన్నారు. గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందేన‌ని.. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా.? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర ప‌న్నింద‌న్నారు. కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో.. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా.? అని నిప్పులు చెరిగారు. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది.. నా జోలికొస్తే.. నీ చీకటి బతుకులను బయటపెడతా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా.. కాంగ్రెస్ తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా.? అని మండిప‌డ్డారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరేన‌న్నారు. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్.. రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని.. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదన్నారు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేన‌న్నారు. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండించారు. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం అన్నారు. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను, నిరుద్యోగులను బేషరతుగా వదిలేయాల‌ని.. మళ్లీ అశోక్ నగర్ వెళ్లే అవకాశం నాకివ్వకండని హాట్ కామంట్స్ చేశారు.

Next Story