మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Nov 2019 12:36 PM GMT
మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం సమ్మె చేస్తాన్నా... నిర్లక్ష్య ధోరణి అవలంబించారని ఆరోపించారు. వీఆర్‌ఎస్‌ అనేది కార్మికుల ఆలోచన పరంగా ఉంటుందని, నిర్భంధంగా వీఆర్‌ఎస్‌ చేయకూడదని అన్నారు. ఒక వేళ తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉందని, ఇది మా పార్టీ ఎజెండా అని అన్నారు. కేసీఆర్‌ పాలన వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగిందేమి లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కేసీఆర్‌ స్పందించకపోవడంతో ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అయినా కేసీఆర్‌కు ఇంత కూడా కనికరం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాలనలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకే ప్రయోజనం కలుగుతుంది తప్ప, జనాలకు పెద్దగా లాభం లేకుండా పోతోందని ఆరోపించారు.

Next Story