టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వారి పేర్లు చెబుతానన్న శ్రీరెడ్డి
By తోట వంశీ కుమార్ Published on 16 Sept 2020 4:47 PM ISTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ విషయాలు బయటపెట్టడానికి తాను సిద్దంగా ఉన్నానని ఓ వీడియో విడుదల చేసింది. కొంతకాలంగా చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి సైలెంట్‌గా ఉంటోంది. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా.. రకుల్ పేరు చెప్పిందని ప్రచారం జరగుతుండడంతో తనదైన శైలిలో ఆమెపై విమర్శులు చేసింది. అప్పట్లో రకుల్ పత్తిత్తులా మాట్లాడింది అంటూ వ్యాఖ్యానించింది.
ఇంకా.. ఆ వీడియో ఆమె ఏం చెప్పిందంటే.. 'నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు నా విన్నపం. టాలీవుడ్‌లో ఉన్న మాఫియా, అకృత్యాలు, అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ఎలా మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకొంటున్నాను. గతంలో ఇలాంటి విషయాలను చెప్పడానికి అర్ధనగ్నంగా నిరసన తెలిపాను. మూవీ ఇండస్ట్రీ కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లో మాత్రమే బంధించబడింది' అంటూ శ్రీరెడ్డి అన్నారు. టాలీవుడ్ లో సైతం చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని శ్రీరెడ్డి ఆరోపించింది.
చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారని చెప్పింది. పెద్దపెద్ద హోటల్స్ లో కూడా పార్టీలు ఏర్పాటు చేసుకుంటారని, వీటిలో డ్రగ్స్ తీసుకుంటారని తెలిపింది. అంతేకాదు ఈ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి, వారిని వాడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు భద్రత కల్పిస్తే.. టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే వారి పేర్లను బయటపెడతానని చెప్పింది. మరీ శ్రీరెడ్డి వ్యాఖ్యలపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.