దర్శకుడు సింగీతం శ్రీ‌నివాస‌రావుకు కరోనా పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sep 2020 10:30 AM GMT
దర్శకుడు సింగీతం శ్రీ‌నివాస‌రావుకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నా-పెద్ద, పేద-ధనిక అన్న తేడాలేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కాగా.. తనకు సెప్టెంబర్‌ 9న కరోనా పాజిటివ్‌గా వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఉంటున్నట్లు తెలిపారు.

'గత 65ఏళ్ళుగా నేను పాజిటివ్‌ గానే ఉన్నాను. ఇప్పుడు మీరు పాజిటివ్ అని చెబుతున్నారేంటని వైద్యులతో చమత్కరించాను.. ప్రస్తుతం డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఐసొలేషన్‌లో ఉన్నానని' తెలిపారు. ఇక ఐసోలేషన్‌లో ఉంటే.. హాస్టల్‌ రోజులు గుర్తుకొస్తున్నాయని చమత్కరించారు. కాగా.. ఈ నెల 21న సింగీతం పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఫోన్లు, మెసెజ్‌లు చేస్తుండడంతో ఆయన ఈ విషయన్ని వెల్లడించారు. ఈనెల 22న హోమ్‌ ఐసోలేషన్‌ పూర్తి కానున్నట్లు వెల్లడించారు.

కరోనా బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఇక సినిమాల విషయానికి వస్తే, త్వరలోనే ఈ సీనియర్ డైరెక్టర్ సమంత ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ తో సింగీతం శ్రీనివాసరావు తీసిన ఆదిత్య 369 సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.

Next Story