పిచ్‌ల‌ను అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా : సూర్య‌కుమార్ యాద‌వ్‌

Suryakumar Yadav on his first practice session in Australia.టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనేందుకు రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2022 6:15 AM GMT
పిచ్‌ల‌ను అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా : సూర్య‌కుమార్ యాద‌వ్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనేందుకు రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా ఆస్ట్రేలియా చేరుకుంది. ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ తొలి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఈ నెల 23న టీమ్ఇండియా ఆడ‌నుండ‌గా.. దానికి రెండు వారాల ముందే పెర్త్‌కు చేరుకుంది. ఇక్క‌డ ప్రాక్టీస్ సెష‌న్ల‌కు తోడు వెస్ట‌ర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లులు కూడా ఆడ‌నుంది. అనంత‌రం ఆస్ట్రేలియా, కివీస్‌తో రెండు వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడ‌తుంది. ఇక తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌బోతున్న దీప‌క్ హుడా, అర్ష‌దీప్ సింగ్ వంటి ఆట‌గాళ్ల‌తో ముచ్చ‌టించిన వీడియోల‌ను బీసీసీఐ పోస్టు చేసింది.

ఈ వీడియోల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ సైతం మాట్లాడాడు. ఇక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డేందుకు ఉత్సుక‌త‌తో ఉన్నాన‌ని చెప్పారు. ఇక్క‌డికి వ‌చ్చి సాధ‌న చేసేందుకు ఎంతో ఎదురుచూశా. మైదానంలోకి అడుగుపెట్టి, న‌డిచి, ప‌రుగెత్తి, ఇక్క‌డ ఎలా ఉంటుందో తెలుసుకోవాల‌ని అనుకున్నాను. ఇక్క‌డి వికెట్‌పై పేస్ ఎలా ఉందో తెలుసుకోవాల‌ని అనుకున్నా. వికెట్ బౌన్స్ చూడాల‌నుకొన్నా. తొలి నెట్ సెష‌న్ అద్భుతంగా ఉంది అని అన్నాడు.

నెట్ సెష‌న్‌పై సూర్య స్పందిస్తూ.. ఇక పిచ్‌పై బౌన్స్ ఉన్న‌ట్లు ప్రాక్టీస్ స‌మ‌యంలో గ‌మ‌నించాను. వికెట్‌పై పేస్‌, ఆస్ట్రేలియాలో గ్రౌండ్ కొల‌త‌లు గురించి చాలా మంది మాట్లాడుతారు. ఈ వికెట్ల‌పై మంచి స్కోర్ సాధించ‌డానికి అవ‌స‌ర‌మైన గేమ్‌ప్లాన్ సిద్దం చేసుకోవడానికి ఇవి చాలా కీల‌కం అని చెప్పాడు.

Next Story