ఐపీఎల్ 2024 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్ సింగ్ 45 బంతుల్లో 71 పరుగులు, రిలే రూసో 24 బంతుల్లో 49 పరుగులు, అథర్వ తైడే 27 బంతుల్లో 46 పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ తరుపున అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 26 బంతుల్లో 42 పరుగులు చేయడంతో హైదరాబాద్ 19.1 ఓవర్లలో 215 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది.
ఈరోజు IPL 2024 చివరి డబుల్ హెడర్ మ్యాచ్‌లు కావడం విశేషం. ఆ తర్వాత మంగళవారం నుంచి ప్లేఆఫ్‌లు ప్రారంభం కానున్నాయి. కోల్‌కతా ప్రస్తుతం 19 పాయింట్లతో, రాజస్థాన్, హైదరాబాద్ ప్రస్తుతం 16 పాయింట్లతో ఉండగా.. కేకేఆర్, ఆర్ఆర్ చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడాల్సివుంది. దీంతో పాయింట్ల పట్టికలో స్పల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక ఆర్సీబీకి 14 పాయింట్లు ఉన్నాయి.
SRH రికార్డ్ ఛేజింగ్స్
215 vs RR, జైపూర్, 2023
215 vs PBKS, హైదరాబాద్, 2024
199 vs RR, హైదరాబాద్, 2019
188 vs DC, ఢిల్లీ, 2018
186 vs CSK, రాంచీ, 2014