బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్ర‌క‌టించిన సునీల్ గవాస్కర్..!

సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on  24 Dec 2023 7:27 PM IST
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్ర‌క‌టించిన సునీల్ గవాస్కర్..!

సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 26న ఇరు జట్లు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మ్యాచ్‌కు ముందు సునీల్ గవాస్కర్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో పాటు ఇద్దరు స్పిన్నర్లను గవాస్కర్ ఎంచుకున్నాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో ఆయ‌న‌ మాట్లాడుతూ.. సునీల్ గవాస్కర్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. దక్షిణాఫ్రికా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గవాస్కర్ త‌న‌ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్ర‌క‌టించాడు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులకు అవకాశం కల్పించాడు.

గవాస్కర్ మాట్లాడుతూ.. నా ప్లేయింగ్ ఎలెవెన్ చాలా సాదాసీదాగా ఉంటుందని పేర్కొన్నాడు. ఓపెన‌ర్లుగా యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మలు.. శుభ్‌మన్ గిల్ నంబర్ త్రీ, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. ఐదో నంబర్ కేఎల్ రాహుల్, ఆరో నంబర్ శ్రేయాస్ అయ్యర్ లు ఉంటారు. ఆల్ రైండ‌ర్‌ రవీంద్ర జడేజా, స్పిన్న‌ర్‌ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు క‌ల్పించారు.ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ల‌కు కూడా స్థానం ఇచ్చారు.

చీలమండ గాయం కారణంగా మహ్మద్ షమీ సిరీస్‌కు దూమ‌య్యాడు. రితురాజ్ గైక్వాడ్ కూడా వేలి గాయం కారణంగా టెస్టుల‌కు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టులో చోటు కల్పించారు. విరాట్ కోహ్లీ కుటుంబ కారణాల వల్ల భారతదేశానికి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికాకు తిరిగి వ‌స్తాడ‌ని బీసీసీఐ భావిస్తుంది.

సునీల్ గవాస్కర్ ప్లేయింగ్ ఎలెవన్..

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Next Story