ఆ ఆటగాళ్లపై సంచలన ఆరోపణలు చేసిన కపిల్ దేవ్
Some players prioritise IPL over playing for country. టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు సెమీస్ కూడా చేరుకోలేకపోవడాన్ని అటు అభిమానులు
By Medi Samrat Published on 8 Nov 2021 9:41 AM GMTటీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు సెమీస్ కూడా చేరుకోలేకపోవడాన్ని అటు అభిమానులు, ఇటు క్రీడా పండితులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. జాతీయ జట్టుకు ఆడటం కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ప్రాధాన్యతనిచ్చే ఆటగాళ్లు ఉన్నారని, భారత క్రికెట్ షెడ్యూల్‌ను మరింత మెరుగ్గా ప్లాన్ చేయాలని భారత కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరారు. టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే ముందు భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2021 రెండో అంచె తర్వాత విశ్రాంతి తీసుకుని ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. అయితే ఆటగాళ్లు ఫ్రాంచైజీలకే ఎక్కువగా కట్టుబడి ఉన్నారంటూ కపిల్ దేవ్ విమర్శలు చేశారు.
ఆటగాళ్లు దేశం కోసం ఆడటం కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనం ఏమి చెప్పగలమని కపిల్ దేవ్ అన్నారు. ఆటగాళ్లు తమ దేశం కోసం ఆడటం పట్ల గర్వపడాలి. వారి ఆర్థిక పరిస్థితులు నాకు తెలియదు కాబట్టి పెద్దగా చెప్పలేనని కపిల్ దేవ్ అన్నారు. ఐపీఎల్ ఆడకూడదని నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడు క్రికెట్‌ను మరింత మెరుగ్గా ప్లాన్ చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని అన్నారు. ఈ ప్రపంచ కప్ నిష్క్రమణ తర్వాత దిగులు చెందాల్సిన అవసరం లేదని, రాబోయే ప్రధాన టోర్నమెంట్‌ల కోసం ఆటగాళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను బీసీసీఐ ప్రారంభించాలని కపిల్ తెలిపారు. ఇది భవిష్యత్తును చూడవలసిన సమయం. మీరు వెంటనే ప్లాన్ చేయడం ప్రారంభించండని అన్నారు. మన ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి.. కానీ వారు దానికి తగ్గట్టుగా రాణించలేకపోయారని అన్నారు.
2012 తర్వాత తొలిసారిగా ఐసిసి టోర్నమెంట్‌లో నాకౌట్‌కు చేరుకోవడంలో భారత్ విఫలమైంది. భారత్ టి20 ప్రపంచకప్ నుంచి ముందుగానే నిష్క్రమించింది. సోమవారం జరిగే తమ చివరి సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ నమీబియాతో తలపడనుంది. గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్, గ్రూప్‌లో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా, గ్రూప్ 2లో మొదటి స్థానంలో ఉన్న పాక్, గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.