సంజు శాంసన్‌కు సీఎస్‌కే కెప్టెన్సీ ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన అశ్విన్..!
ఐపీఎల్- 2024 వేలానికి ముందు ఆటగాళ్ల ట్రేడింగ్ గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి.
By Medi Samrat Published on 29 Nov 2023 8:35 PM ISTఐపీఎల్- 2024 వేలానికి ముందు ఆటగాళ్ల ట్రేడింగ్ గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లగా.. కామెరాన్ గ్రీన్ ముంబై నుండి RCBకి వెళ్లాడు. ఇదిలా ఉంటే జస్ప్రీత్ బుమ్రాపై వార్తలు వస్తున్నాయి. అలాగే.. ఎంఎస్ ధోని అనంతరం సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ కోసం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ధోనీ మాదిరిగా సంజూ శాంసన్ వికెట్ కీపర్ కూడా కావడమే ఇందుకు కారణం అంటుండగా.. ఈ వార్తల్లో నిజమెంతో అశ్విన్ చెప్పాడు.
మంగళవారం నుండి రవిచంద్రన్ అశ్విన్‌ను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. 'అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో.. సంజూ శాంసన్‌కు CSK నుండి కెప్టెన్సీ ఆఫర్ వచ్చినట్లు.. కానీ శాంసన్ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు.. కానీ భవిష్యత్తులో దాని సాధ్యాసాధ్యాలు చూడవచ్చు' అని అశ్విన్ చెప్పినట్లుగా ఓ పోస్టు ఎక్స్‌లో వైరల్ అవుతుంది. దీనిపై అశ్విన్ స్పందిస్తూ.. ఈ వార్తలో నిజం లేదని చెబుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఫేక్ న్యూస్..! నన్ను ఉటంకిస్తూ అబద్ధాలు చెప్పకండి అని అశ్విన్ వైరల్ అవుతున్న ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.
ఐపీఎల్‌కు ముందు ప్రతిసారీ ఎంఎస్ ధోనీ ఆడతాడా లేదా అనే ఊహాగానాలు వెలువడుతుండటం గమనార్హం. గత సీజన్ తర్వాత అతనికి మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం అతను ఫిట్‌గా ఉన్నాడు. అతడు IPL-2024 సీజన్ ఆడతాడనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ జట్టుతో అట్టిపెట్టుకుంది.
సీఎస్‌కే ప్రస్తుత ఆటగాళ్ల జాబితా
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాండ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), దీపక్ చాహర్, మహిష్ తీక్షణ, మతిసా పతిరనా, ముఖేష్ వరుణ్.