Viral Video : మొదటి బంతికే సిక్సర్ కొట్టాలా..? 'పిచ్చి పట్టిందా'.? : రోహిత్
టీమ్ ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.
By Medi Samrat Published on 11 Oct 2024 9:30 PM ISTటీమ్ ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. T20 వరల్డ్ కప్-2024 తర్వాత T20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయినందున రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో లేడు. అయినా రోహిత్ విశ్రాంతి తీసుకోవడం లేదు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్‌కు వెళ్లే ముందు రోహిత్ ఒకరిపై కోపంగా ఉన్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ విజయం సాధించింది. ఈ సిరీస్‌లో రోహిత్ పెద్దగా రాణించలేదు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఈ లోటును భర్తీ చేయాలని రోహిత్ కోరుకుంటున్నాడు, అందుకే విపరీతంగా చెమటోడుస్తున్నాడు.
రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో రోహిత్ నెట్ ప్రాక్టీస్‌కు వెళ్లి బ్యాటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు చూడవచ్చు. రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి నెట్స్‌కి వెళ్లాడు. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మొదటి బంతికే సిక్సర్ కొట్టమని వాయిస్ వినపడుతుంది. దీనికి రోహిత్ తనదైన శైలిలో సమాధానమిస్తూ.. 'పిచ్చి పట్టిందా' అని రియాక్ట్ అవుతాడు. ఆ తర్వాత రోహిత్ నెట్స్‌కి వెళ్లి పవర్‌ఫుల్‌గా బ్యాటింగ్ చేస్తూ స్వేచ్ఛగా షాట్లు ఆడుతాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్నాయి. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ ఆడాలంటే, న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల హోమ్ సిరీస్‌ను గెలవాలి. ఈ విషయం రోహిత్‌కి కూడా బాగా తెలుసు. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ అక్టోబర్ 16 నుంచి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అక్టోబర్ 24 నుంచి పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. మూడో మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.