'రిటైరయ్యే ప్రసక్తే లేదు'.. క్రికెట్‌కు వీడ్కోలుపై రోహిత్ ఏమన్నాడంటే..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చర్చ జరిగింది.
By Medi Samrat Published on 10 March 2025 7:20 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చర్చ జరిగింది. అదే విధంగా గతేడాది ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు బై బై చెప్పాడు. అయితే ఈ పుకార్లకు రోహిత్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. వన్డేల నుంచి రిటైరయ్యే ప్రసక్తే లేదని రోహిత్ స్పష్టం చేశాడు.
రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుని ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. కెప్టెన్‌గా రోహిత్‌కి ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. దీంతో ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న భారత రెండో కెప్టెన్‌గా నిలిచాడు.
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. "ఇంకో విషయం.. నేను ఈ ఫార్మాట్ (ODI) నుండి రిటైర్ అవ్వడం లేదు.. భవిష్యత్తులో ఎటువంటి పుకార్లు వ్యాపించకుండా చూసుకోవాలనుకుంటున్నాను" అని విలేకరుల సమావేశం ముగింపులో చెప్పాడు. రోహిత్ ఇలా చెప్పడంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది, మీడియాకు ధన్యవాదాలు తెలిపిన భారత కెప్టెన్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో రోహిత్‌పై ఒత్తిడి నెలకొంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో ఓటమి రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలను లేవనెత్తింది. అప్పటి నుంచి అతడి రిటైర్మెంట్‌పై వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా టూర్ అనంతరం బీసీసీఐ సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. తాను కొద్దిరోజుల పాటు ఆటలో కొనసాగుతానని అన్నాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ పెద్ద నిర్ణయం తీసుకోగలడని భావించారు.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓడిపోతే రోహిత్ నిష్క్రమణ ఖాయమని, భారత్ గెలిస్తే రోహిత్ ఆటను కొనసాగిస్తాడని చాలా మీడియా కథనాలలో చెప్పబడింది. ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో రోహిత్ సమావేశం కానున్నాడని.. ఆ తర్వాత తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాడని వార్తా సంస్థ పిటిఐ తన నివేదికలో పేర్కొంది.