ఎందుకు త‌ప్పుకోవాల్సివ‌చ్చింది.? మౌనం వీడిన‌ రోహిత్‌

సిడ్నీ టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఫామ్ తో సతమతమవుతున్న రోహిత్ శర్మ తప్పుకుని శుభమాన్ గిల్ కు అవకాశం ఇచ్చాడు.

By Medi Samrat  Published on  4 Jan 2025 8:03 AM IST
ఎందుకు త‌ప్పుకోవాల్సివ‌చ్చింది.? మౌనం వీడిన‌ రోహిత్‌

సిడ్నీ టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఫామ్ తో సతమతమవుతున్న రోహిత్ శర్మ తప్పుకుని శుభమాన్ గిల్ కు అవకాశం ఇచ్చాడు. మ్యాచ్ నుండి తప్పుకోవడంపై రోహిత్ శర్మ తన మౌనాన్ని వీడాడు. జట్టు అవసరం కోసమే తప్పుకున్నట్లు వెల్లడించాడు. సిరీస్‌లోని 2వ మ్యాచ్‌లో జట్టులో చేరినప్పటి నుండి రోహిత్ స్కోర్ చేయడానికి కష్టపడుతూ ఉన్నాడు.

భారత కెప్టెన్ 5 ఇన్నింగ్స్‌ల్లో 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే రోహిత్ సిడ్నీలో తప్పుకున్నాడు. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2వ రోజు లంచ్ బ్రేక్ సమయంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రోహిత్, తాను జట్టు నుండి తప్పుకోలేదని లేదా జట్టు నుండి వైదొలగలేదని, ఫామ్‌లో ఉన్న ఆటగాడి కోసం పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ విషయం గురించి తాను కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో మాట్లాడానని, వారు తన నిర్ణయానికి మద్దతు ఇచ్చారని రోహిత్ శర్మ తెలిపాడు. నేను ఫామ్‌లో లేను, ఇది ఒక ముఖ్యమైన గేమ్. మాకు ఇన్-ఫామ్ ప్లేయర్ కావాలి. ప్రస్తుతం మా బ్యాటింగ్ ఆర్డర్ ఫామ్‌లో లేదు. కాబట్టి ఫామ్‌లో లేని ఆటగాళ్లు జట్టును మోయలేరు. కాబట్టి ఇది నాకు చాలా సాధారణ విషయం. నేను కోచ్‌కి, సెలెక్టర్‌కి ఈ విషయం చెప్పాను, వారు నా నిర్ణయానికి మద్దతు ఇచ్చారని రోహిత్ తెలిపాడు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని కూడా రోహిత్ తెలిపాడు.

Next Story