సన్ రైజర్స్ కెప్టెన్ అతడేనా..?

మార్చి 22న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్‌గా పాట్ కమిన్స్ ను నియమించబోతున్నారు.

By Medi Samrat  Published on  2 March 2024 6:00 PM IST
సన్ రైజర్స్ కెప్టెన్ అతడేనా..?

మార్చి 22న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్‌గా పాట్ కమిన్స్ ను నియమించబోతున్నారు. ఇటీవల వేలంలో INR 20.5 కోట్లకు ఆస్ట్రేలియన్ కెప్టెన్ ను సొంతం చేసుకుంది సన్ రైజర్స్. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ఆరెంజ్ ఆర్మీకి పాట్ కమిన్స్ నాయకత్వం వహించబోతున్నాడు. 2023 ఐపీఎల్ లో సన్ రైజర్స్ దారుణంగా ఆడింది. 14 మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే గెలిచింది. IPL 2023లో ఐడెన్ మార్క్రామ్ నాయకత్వంలో ఘోర ఓటములను సన్ రైజర్స్ చవిచూసింది.

SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు వరుస టైటిళ్లను గెలవడంలో సహాయపడిన మార్క్‌రమ్‌పై నమ్మకం ఉంచాలా వద్దా అనే దాని గురించి చర్చలు జరిగాయి. అయితే చాలా మంది ఆస్ట్రేలియాకు ODI ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్స్ అందించిన కమిన్స్ నే ఐపీఎల్ లో కెప్టెన్ చేయాలని సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయానికి వచ్చింది.

డేవిడ్ వార్నర్ జట్టులో ఉన్నప్పుడు SRH మంచి విజయాలను అందుకుంది. 2016- 2020 మధ్య, సన్ రైజర్స్ ప్రతి సీజన్‌కు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించారు, ఇందులో 2016లో IPL టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది సన్ రైజర్స్. కమ్మిన్స్ తిరిగి జట్టులోకి జోష్ తెస్తాడని సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తూ ఉంది. సన్ రైజర్స్ మొదటి మ్యాచ్‌ని మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

Next Story